Thursday, 6 March 2014



         రాజధానిలో రాజకీయాలు..
 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో రాజధాని రాజకీయంగా వేడెక్కింది.గత కొంత కాలంగా ఉద్యమాలతో అట్టుడికిన భాగ్యనగరంలో ఎన్నికల సందడి మొదలైంది.ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ అభ్యర్థుల ఖరారుతోపాటు గెలుపు కోసం వ్యూహ,ప్రతివ్యూహాలు చేస్తున్నాయి.ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గెలుపు,ఓటములను నిర్ణయించే గ్రేటర్ ఓటర్లు ఎన్నికల్లో ఎవరకి పట్టం కడతారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎన్నికల సంగ్రామానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి.ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే 54రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాల సన్నాహాలను గత నెలరోజుల నుంచే ప్రారంభించింది. అధికారుల బదిలీలతో పాటు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు.గ్రేటర్ పరిధిలో 24శాసన సభ స్థానాలకు ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 74లక్షల 56వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.24 అసెంబ్లీ స్థానాల్లో 15స్థానాలు హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. 9అసెంబ్లీ స్థానాలు రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలోని నగర శివార్లలో ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలో ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో సికింద్రాబాద్, హైదరాబాద్,మల్కాజ్ గిరి మూడు పార్లమెంటు స్థానాలుగ్రేటర్ పరిధిలో ఉండగా చేవెళ్ల,భువనగిరి పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అన్ని పార్టీలలో అతిరథ నాయకులు గ్రేటర్ పరిధిలోనుంచే ప్రాతినిథ్యం వహించడం విశేషం.లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు,కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దిన్ ఓవైసీతోపాటు జయసుధ వంటి నేతలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే ఎన్నికల్లో కొంతమంది నాయకులు కొత్త నియోజకవర్గాలను ఎంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిస్తోంది.అయితే ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. నెల రోజుల క్రితమే లోక్ సత్తా పార్టీ అభ్యర్థులను ప్రకటించి ముందుంది. ఖరారైన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో తలామునకలయ్యాయి..

 ఇప్పటివరకు రాజకీయ పార్టీల పొత్తులు ఖరారు కాలేదు. గత ఎన్నికల్లో గ్రేటర్ లో బలంగా ఉన్న మజ్లిస్.. కాంగ్రెస్ పార్టీలు అవగాహన ఒప్పందాన్ని పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచాయి.. మహాకూటమి నుంచి టీడీపీ.. వామపక్షాలు..టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయగా.. బీజేపీ మాత్రం ఒంటరిపోరు చేసింది. అయితే లోక్ సత్తా పార్టీ కూడా పొత్తులు పెట్టుకోలేదు.. రెండు పార్టీల అధ్యక్షులు అటు కిషన్ రెడ్డి.. ఇటు జయప్రకాష్ నారాయణ మాత్రమే విజయం సాధించారు.. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ గ్రేటర్ లో అధిక స్థానాలను గెలుచుకుంది.. కేవలం రాజేందర్ నగర్ నుంచి మాత్రమే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.. పాతబస్తీలో మజ్లిస్ తన పట్టును నిలుపుకుంది. అయితే సారి సిట్టింగ్ అభ్యర్థుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.. మారిన రాజకీయ పరిస్థితులు పొత్తులు తమ స్థానాలు నిలబెట్టుకుంటామా లేదా అనే ఆందోళనలో పడ్డారు..ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసులు భారీ బలగాలను రంగంలోకి దించుతున్నారు.. ఇప్పటికే 24 అసెంబ్లీలకు ఐదు పార్లమెంట్ స్థానాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. పొత్తులు ఖరారు కావడంతో పాటు అభ్యర్థుల ఎంపికే మిగిలి ఉంది.

No comments:

Post a Comment