Sunday, 14 September 2014

గౌడ కులస్థులందరితో సంప్రదింపులు జరపాలి; రామక్రిష్ణ,

నూతన కార్యవర్గానికి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి; కనకమామిడి మధుల
సనత్ నగర్ లో 12 సంవత్సరాలు జరిగినా గౌడ సంఘం ఎన్నికలు జరగలేదు... 

విలేకరుల సమావేశంలో పాల్గొన్న సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సల్వంచ రామక్రిష్ణ గౌడ్,  కనకమామిడి మధు తదితరులు..
తెలంగాణ, వెబ్ న్యూస్... హైదరాబాద్; సర్దార్ సర్వార్ పాపన్న  గౌడ సాంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుభాష్ నగర్ కమిటీ హాలులో  విలేకరుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. సమావేశంలో  సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సల్వంచ రామక్రిష్ణ గౌడ్,  కనకమామిడి మధులు మాట్లాడుతూ సనత్ నగర్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరణించి 12 సంవత్సరాలు గడిచిన గౌడ సంఘం ఎన్నికలు జరగలేదన్నారు.  పాతబాడిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ముఖ్యంగా కల్లు కంపౌండ్ల ఏర్పాటుకై కులస్థులందరిని సంప్రదింపులు జరిపి నూతన కార్యవర్గ ఎన్నికలు అయ్యే వరకు ఎలాంటి ప్రకటనలు, నిర్ణయాలు  తీసుకోవద్దని తెలిపారు. ఈ నూతన కార్యవర్గంలో యువతకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, అజయ్ గౌడ్, రాజేశ్ గౌడ్, దుర్గ ప్రసాద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment