హైదరాబాద్ తెలంగాణ వెబ్ న్యూస్ : డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమలకు రూ 500 కోట్లతో ఆదిభట్ల లో పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శంకుస్తాపన చేశారు. మాదాపూర్ లోని హెచ్ఐసిసి వేదికగా జరిగిన కార్యక్రమం లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానాని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పరిశ్రమల అనుమతి కోసం సింగల్ విండో విధానాని తీసుకు వచ్చామని చెప్పారు. సింగల్ విండో విభాగం సీఎంవోలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్దికి హైదరాబాద్ వేదికగా మారిందని తెలిపారు. పారిశ్రామిక వేతలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
No comments:
Post a Comment