Sunday, 24 August 2014

హైటెక్ సిటి హవాసా హోటల్ ల్లో ఘనంగా డొమైన్ డే వేడుకలు....

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; భారతదేశంలో ఎక్కడ ప్రతి మూలలో బహుల గొంతులో వినిపించేది ఇంటర్నెట్... ఇంటర్నెట్ లేనిదే జీవితం గడవలేని పరిస్థితి ఈ కాలం... డొమైన్ రోజును పురస్కరించుకొని ఈ నెల 27 నుంచి డొమైన్ పేర్లు భారతీయ భాషల్లోకి అనువదించాలని  భారత డొమైన్స్ అసోసియేషన్  సంస్థ సీఈవో గోవింద్ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్ లోని అవాసా హోటల్ ల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా డొమైన్ రోజును జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేవనాగరి లిపిలో డొమైన్ పేర్లు ఉన్నాయని, హిందీ, కాశ్మీరీ, కొంకణి, మరాఠీ, నేపాల్ తదితర బాషల్లో ఉన్నాయని తెలిపారు. అందుకు త్వరలోనే మన భారత దేశంలో తెలుగు, బెంగాలి, గుజరాతీ, ఉర్దూ, తమిళం, పంజాబి సహా ఇతర భాషల్లో డొమైన్ పేర్లు తీసుకువస్తామన్నారు. గూగుల్, యాహూ, ఫేస్ బుక్ వంటి 500 కంపెనీలు కూడా ప్రీమియం డొమైన్ పేర్లకు పెట్టుబడి పెట్టారన్నారు. ఆగస్టు 24 ప్రపంచ డొమైన్ డే, భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ డొమైన్ కాన్ఫిరెన్స్ నేడు ఇక్కడ ముగించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ప్రమోషన్ వైపు పని ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, పౌర సమాజం, ప్రైవేట్ రంగం, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు అనేక రంగాలకు డొమైన్ లు ఎంతో అవసరమని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ అడ్వజర్ నారాయణ, వరల్డ్ డొమైన్ డే ఫౌండర్ ప్రకాశ్ బిందాల్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment