Wednesday, 13 August 2014

హైదరాబాద్ లో ఐటి సదస్సు..... త్వరలో భారతదేశంలోనే అతిపెద్ద సదస్సు... 1500 స్టార్టప్ కంపెనీలు పాల్గొననున్నాయి....


ఆగస్టు ఫెస్ట్ సమావేశంలో మాట్లాడుతున్న ఐటి శాఖ మంత్రి కెటిఆర్... తదితరులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;భారతదేశంలో ఐటి పరంగా హైదరాబాద్ ను అతి పెద్ద ఐటి హాబ్ గా  పేరు పొందడానికి త్వరలో ఎన్నడూ లేని విధంగా 1500 స్టార్టప్ కంపెనీలు త్వరలోనే ఈ ఈవెంట్ ను ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం బంజారాహిల్స్ తాజ్ బంజారాలో ఆగస్టు ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని ఆయన పాల్గొని  మాట్లాడారు. హైదరాబాద్ విషయంలో ఐటి టెక్నాలజి పరంగా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మన దేశం ఒక స్థాయి సాధిస్తే అధి హైదరాబాద్ కు మంచి పేరు వస్తుందన్నారు. దీనికి గవర్నమెంట్ కృషి కూడా ఉంటుందన్నారు. మన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి ఐటి పరంగా బెస్ట్ మైండ్స్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంటుందని తెలిపారు. ఫిలిం, మ్యూజిక్, ఫ్యాషన్ రంగాలలో ఉన్నతులుగా ఉన్నవారికి ఇలాంటి సదసులు ఎంతో  ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో  రమేష్, కిరణ్, డి.రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment