Friday, 15 August 2014

తొలిసారి గొల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్....

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోల్కొండలో తెలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను శుక్రవారం ఎగురవేశారు. అనంతరం గోల్కొండ కోట పై నుంచి కేసీఆర్ ప్రసంగం ఆకట్టుకుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మొదటి సారిగా గోల్కొండ పై నుంచి ఎగురవేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో 3,600 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. దసరా, దీపావళి కాలంలో వృద్దులకు వెయ్యి, వికలాంగులకు 1500 ఫించను ఇవ్వనున్నట్లు తెలిపారు. గొల్కొండ  కోట పైన కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment