Wednesday, 20 August 2014

కేసీఆర్ తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం; విజయారెడ్డి, విజయారెడ్డికి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, దారి పొడువునా స్వాగత వేడుకలతో టీఆర్ఎస్ సందడి...

ఖైరతాబాద్ చౌరస్తాలో ర్యాలీగా టీఆర్ఎస్  భవన్ కు వెళ్తున్న విజయారెడ్డి, చేగూరు నాగార్జున తదితరులు 
తెలంగాణవెబ్ న్యూస్, హైదరాబాద్; దివంగత నేత పి.జనార్థన్ రెడ్డి కుమార్తే పి.విజయారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్న  సందర్బంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో  భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ లోని  పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  అనంతరం మహంకాళి దేవాలయం వద్ద పి.విజయారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దారి పొడువునా విజయారెడ్డి అనుచరులతో పాటు  టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు బ్రహ్మ రథం పట్టారు.  ఖైరతాబాద్ డివిజన్ లో  పలు బస్తీల నుంచి వచ్చిన వందలాది మంది పీజేఆర్ అభిమానులు  ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ రోడ్ నెం.10 మీదుగా తెలంగాణ భవన్ వరకు అడుగడుగునా కార్యకర్తలు బాణా సంచాలు కాల్చుతూ సందడి చేశారు. డిజె డప్పు వాయిధ్యాలతో డ్యాన్సులు చేశారు.  ఈ సందర్బంగా విజయారెడ్డి మాట్లడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన  ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆయన సారధ్యంలో పని చేయాలన్నా సంకల్పంతో టీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. పదవీ ఉన్నా లేకున్నా ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. విజయారెడ్డి తరుపున టీఆర్ఎస్ లో చేరిన వారిలో  చేగూరు నాగార్జున, శ్రీనివాస్, రజినీకాంత్,  అందెల మహేష్ యాదవ్, ఖైరతాబాద్ నుంచి శ్రీనివాస్ యాదవ్, కె.వి.ప్రసాద్, రాజు పంజాగుట్ట డివిజన్  కాంగ్రెస్ నుంచి అరుణ్ కుమార్, మెట్టు రాజు, నరేష్, బాసిత్, చారి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 
ఘనంగా స్వాగతం పలికిన టీఆర్ఎస్ కార్యకర్తలు.....
పీజేఆర్ కూతురు విజయారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్బంగా డివిజన్ లోని  పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14 నంది నగర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ సంయుక్త కార్యదర్శి భి.రామక్రిష్ణ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున్న  ర్యాలీగా తెలంగాణ  భవన్ కు  చేరకున్నారు. మహ్మద్ ఇసాక్, ఒ.శ్రీను, నజీర్, తుబ్బు బేగ్ తదితరులు టీఆర్ఎస్ లో  చేరారు. 

No comments:

Post a Comment