తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్.... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 లక్ష 30 వేల ఆటోలు ఉన్నాయి. సుమారు 2 లక్షల 40 వేల మంది ఆటో డ్రైవర్లు ఉపాధి పొందుచున్నారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లకు వ్యాపారం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని బిఎంఎస్, ఐఎఫ్ టియు, ఐఎన్ టియుసి, ఎన్ టిఎడియు, ఎన్ఎడబ్లూఎస్ సేవా సంస్థ వారు తెలిపారు. గత ప్రభుత్వం జీవో నెం.90 ద్వారా 20 వేల ఆటోలకు క్రొత్తగా పర్మిట్లు ఇచ్చి ఆటో డ్రైవర్లను నిరుత్సాహ పరిచిందన్నారు. అప్పటిలో ఆటో సంఘాలు కొత్త ఆటోలకు వ్యతిరేకంగా ఉధ్యమించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం దళారులను, షోరూం యజమానులను, ఆటో ఓనర్స్ అసోసియేషన్, ఆటో డీలర్స్, ప్రైవేట్ ఫైనాన్స్ లను లాభ పరిచే విధంగా ఆటో పర్మిట్ల జీవోను విడుదల చేసిందన్నారు. దీనిని ఆటో డ్రైవర్లు పూర్తిగా వ్యతిరేకించడం జరిగిందన్నారు. గత జీవోలో 20 వేల కొత్త ఆటోలలో 11 వేల ఆటోలు మాత్రమే అమ్మకం జరిగిందన్నారు. మెట్రో రైలు వచ్చిన తరువాత ప్రయాణీకులు ఆటోలు ఎక్కని పరిస్థతి ఉత్పన్నమవుతుందన్నారు. ఆటో షోరూం యజమానులు ఆటోలను బ్లాకులో అమ్ముకునే పరిస్థతి వస్తుందని తెలిపారు. నగరంలో కాబ్ లు, టాక్సీలు కూడా ఎక్కవగా ఉండటం వలన ఆటోల గిరాకీ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక కుంటుంబాలు పోషించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రవి శంకర్, హబీబ్ ఐఎఫ్ టియు నరేందర్, ఐఎన్ టియుసి ఎన్.నర్సింహా రెడ్డి, నర్సింహారావు, మల్లేష్ గౌడ్, ఎన్ టిఎడియు కె.రాజారావు, ఎన్ఎడబ్లూఎస్ శ్రీనివాస చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment